
సమర ‘సిందూరం’
● ఉగ్రశిబిరాలపై భారత్ దాడులపై హర్షం ● దీటైన స్పందనకు జిల్లావాసుల మద్దతు ● జిల్లావ్యాప్తంగా మిన్నంటిన సంబరాలు ● త్రివర్ణ పతాకాలతో ఊరూరా ర్యాలీలు
నిర్మల్: జిల్లాకేంద్రంలోని త్రివర్ణ పతాకాలతో నినదిస్తున్న జిల్లావాసులు
నిర్మల్: పచ్చని పహల్గాంలో 26మంది అమాయకుల నెత్తురు చవిచూసిన పాకిస్తాన్ ఉగ్రమూకలకు మంగళవారం కాళరాత్రిని చూపింది మన సైన్యం. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఉగ్రవాదుల పీచమణిచేందుకు చేపట్టిన సైనికచర్యపై యావత్ జిల్లా హర్షాతిరేకాలు వ్యక్తంచేస్తోంది. మన యుద్ధ విమానాలు శత్రుదేశంలో బాంబులమోత మోగించాయన్న వార్త తెలిసిన మరుక్షణం నుంచే ప్రతిఒక్కరూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు. జిల్లాకేంద్రంతో పాటు పలుచోట్ల బాణాసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ త్రివర్ణ పతాకాలతో ర్యాలీలు నిర్వహించారు. ఒకవేళ పాకిస్థాన్‌తో పూర్తిస్థాయిలో యుద్ధమే చేయాల్సి వస్తే.. సేవలందించేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నామని మాజీ సైనికులు చెబుతుండటం విశేషం. ‘ఆపరేషన్ సిందూర్’తో జిల్లాలో ఎటుచూసినా దేశభక్తి భావన ఉప్పొంగుతోంది. ప్రతిఒక్కరూ ‘సైన్యానికి సెల్యూట్’ అంటూ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన పలువురు ఆపరేషన్ సిందూర్‌పై తమ అభిప్రాయాలు వెలిబుచ్చారు.
ఆర్మీది సాహసోపేత నిర్ణయం
ఖానాపూర్: పాక్ తీవ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ చర్యలను ప్రపంచ దేశాలు స్వాగతిస్తున్నాయి. సహాసోపేతమైన నిర్ణయం తీసుకున్న భారత ఆర్మీకి సెల్యూట్. నేను ఆర్మీలో పని చేసిన. ఎప్పుడు పిలుపొచ్చినా మళ్లీ వెళ్తా. దేశ సేవకే నా జీవితం అంకింతం. – పాదం రాజన్న,
రిటైర్డ్ కెప్టెన్, పఠాన్‌కోట్ (పంజాబ్)
పిలుపు వస్తే మళ్లీ వెళ్తా
నిర్మల్: పహల్గాం ఘటన కు ప్రతీకారంగా శత్రుదేశానికి సరైన బుద్ధి చెప్పేలా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టడం హర్షణీయం. నేను 1993నుంచి 2014వరకు సైన్యంలో బ్లాక్‌క్యాట్ కమాండోగా, బాంబ్‌టెక్నీషియన్‌గా పని చేసిన. సైన్యం నుంచి పిలు పువస్తే మళ్లీ వెళ్తా. – కొండాపురం ప్రభాకర్,
రిటైర్డ్ హవల్దార్, కడెం
ఇది భారతీయుల విజయం
నిర్మల్ రూరల్: ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ దాడి చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడం భారతీయుల విజయం. ఆపరేషన్ సిందూర్ 100 కోట్ల భారతీయులకు ఆత్మస్థైర్యాన్నిచ్చింది. భారత్ శక్తి, సామర్థ్యాలు ప్రపంచ దేశాలకు తెలియజేసే సమయం ఆసన్నమైంది. – కూన ప్రదీప్, చార్టెడ్ అకౌంటెంట్, నిర్మల్
పాకిస్తాన్‌లో మూడునెలలున్న
నిర్మల్: నేను 38ఏళ్లు ఆర్మీలో పనిచేశాను. గతంలో పాకిస్తాన్‌తో యుద్ధం జరిగినపుడు లాహోర్ ప్రాంతంలోనే ఉన్నాను. ఆనాటి యుద్ధంతో పాటు పలు దాడుల్లో పాల్గొనడం గర్వంగా ఉంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టడం హర్షణీయం. – కూన చిన్ననర్సయ్య, రిటైర్డ్ సుబేదార్, నిర్మల్

సమర ‘సిందూరం’

సమర ‘సిందూరం’

సమర ‘సిందూరం’

సమర ‘సిందూరం’