
చెరువుమట్టి..చేనుకు బలం
వచ్చే నెలలో వానాకాలం సాగు పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో పంటచేలను సారవంతం చేసుకునేందుకు అన్నదాతలు చెరువుమట్టి తరలిస్తున్నారు.
9లోu
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ముఖద్వారంగా గోదావరిపై ఉన్న సోన్ మండల కేంద్రంలో గోదావరి నదిపై గల పాత వంతెన పర్యాటక ప్రదేశంగా ఉపయోగపడుతుంది. దీనిని 1932లో కేవలం రూ.9 లక్షల 50 వేలతో రాతి, డంగుసున్నంతో నిర్మించారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీనిపై నుంచి గోదావరి అందాలతో పాటు పచ్చని ప్రకృతిని వీక్షించవచ్చు. ఈ బ్రిడ్జినే పర్యాటకంగా ఉపయోగించుకునేందుకు యోచన చేశారు. వంతెనను శుభ్రం చేయడంతో పాటు రంగులు, లైటింగ్, సందర్శకులు కూర్చునేందుకు బెంచీలు ఏర్పాటు చేయాలని ఆరేళ్ల క్రితమే అప్పటి కలెక్టర్ ప్రశాంతి ఆర్‌అండ్‌బీ అధికారులకు సూచించారు. వంతెన దిగువన గోదావరిలో బోటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు చెప్పారు. కానీ ఏ ఒక్క పని కూడా అమలు రాలేదు. ఎప్పటిలాగే ఆ రాతివంతెన అభివృద్ధి కోసం ఎదురుచూస్తూనే ఉంది.
సోన్‌వద్ద గోదావరిపై పాత వంతెన