నిర్మల్ టౌన్: దేశీయ పశుసంపదను పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాలని క్లీమామ్ గోశాల వ్యవస్థాపకురాలు, సేవ్ దేశీ కౌస్ క్యాంపెయినర్ అల్లోల దివ్యారెడ్డి కోరారు. బుధవారం తిరుపతిలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కలిశారు. క్రాస్ బ్రీడింగ్‌తో దేశంలో అంతరించిపోయే దశకు చేరిన దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న క్యాంపెయినింగ్‌కు మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు. దేశవాళీ ఆవుల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా దేశవాళీ ఆవుల సంరక్షణకు చేస్తున్న మంచి కార్యక్రమాలకు తమ మద్దతు ఉంటుందని బీఆర్ నాయుడు పేర్కొన్నట్లు అల్లోల దివ్యారెడ్డి తెలిపారు.