ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు | - | Sakshi
Sakshi News home page

ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు

Mar 12 2025 7:33 AM | Updated on Mar 12 2025 7:29 AM

అంకితభావంతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ జానకీషర్మిల

నిర్మల్‌టౌన్‌: పోలీస్‌ అధికారులు, సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకీషర్మిల సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నిర్మల్‌ సబ్‌ డివిజన్‌ కార్యాలయం, రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. 5ఎస్‌ అమలు చేయాలని తెలిపారు. ఠాణా పరిధిలో ఏ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ఇన్వెస్టిగేషన్‌లో ఉన్న సీడీ ఫైల్స్‌ను పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది ప్రజల సమస్యలు తీర్చడానికి అందుబాటులో ఉండాలన్నారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైం రేటు తగ్గించాలన్నారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలో మొక్కలు నాటారు. ఎస్పీ వెంట నిర్మల్‌ ఏఎస్పీ రాజేశ్‌మీనా, నిర్మల్‌ రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ, ఎస్సై లింబాద్రి ఉన్నారు.

భైంసాటౌన్‌: నియోజకవర్గంలో విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌ అన్నారు. పట్టణంలోని జీఆర్‌పీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీఎం ఉష కింద రూ.3.97 కోట్లతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పీఎం ఉష కింద డిగ్రీ కళాశాలకు రూ.5 కోట్లు మంజూరయ్యాయని, వీటిలో రూ.3.97 కోట్లతో 12 అదనపు తరగతి గదులు, విద్యార్థులకు మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. నిర్మాణ పనులు నాణ్యతగా చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. త్వరలోనే కళాశాలలో పీజీ తరగతులు ప్రారంభించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంగాధర్‌, తూమోల్ల దత్తాత్రి, సిరం సుష్మారెడ్డి, ఈడబ్ల్యూఐడీ ఈఈ అశోక్‌కుమార్‌, డీఈఈ గంగాధర్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ బుచ్చయ్య, కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

కడెం: మండలంలో సదర్మాట్‌ ఆయకట్టు పరిధిలోని పంటలు నీరు అందక ఎండిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఈనెల 5న ‘పంట తడికి..కంటతడి’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మంగళవారం మండలంలోని కొత్తమద్దిపడగ శివారులో ఎండిన పొలాలను పరిశీలించారు. యాసంగిలో ఏయో పంటలు సాగు చేస్తున్నారో రైతులను అడిగి తెలుసుకున్నా రు. సాగునీరు అందక ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దని సూచించారు. ఏప్రిల్‌ చివరి వరకు సదర్మాట్‌ చివరి ఆయకట్టుకు వరకు సాగు నీరందించాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట డీఏవో అంజిప్రసాద్‌, ఈఈ విఠల్‌, తహసీల్దార్‌ ప్రభాకర్‌, ఎంపీడీవో అరుణ, ఎంపీవో కవిరాజు, రైతులు ఉన్నారు.

నిర్మాణం నాణ్యతగా చేపట్టాలి

ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌

కలెక్టర్‌ అభిలాష అభినవ్‌

ఏప్రిల్‌ చివరి వరకు సాగు నీరందించాలని ఆదేశం

ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు 1
1/3

ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు

ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు 2
2/3

ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు

ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు 3
3/3

ఒక్క ఎకరా కూడా ఎండిపోవద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement