● బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్‌చైన్‌గేట్/దిలావర్‌పూర్/నర్సాపూర్(జి)/సారంగాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో పెళ్లయిన ఆడబిడ్డలకు రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని ఇచ్చిన హామీ ఎక్కడా అని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నిర్మల్ రూరల్, దిలావర్‌పూర్, నర్సాపూర్(జి) మండల కేంద్రాల్లో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. సారంగాపూర్ మండల కేంద్రంలో ధని నుంచి ఆలూరు వరకు బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన 420 హామీలను తుంగలో తొక్కారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రత్నకల్యాణి, మండల అధికారులు, జిల్లా బీజేపీ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.