
సారూ.. మమ్మల్ని అన్యాయం చేయకండి
● దిలావర్‌పూర్‌లో ఇళ్లులేని నిరుపేదల ఆక్రందన
దిలావర్‌పూర్: మండల కేంద్రమైన దిలావర్‌పూర్‌లో ఐదేళ్లక్రితం నూతన టెక్నాలజీతో 30 డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మాణం చేపట్టారు. మూడేళ్లు కావస్తున్నా అర్హులైన నిరుపేదలకు ఇవ్వకపోవడంతో 15 రోజుల క్రితం గ్రామంలోని ఇండ్లులేని నిరుపేదలు వాటిని ఆక్రమించి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా మంగళవారం కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసుల అధికారులు వారిని అందులో నుండి ఖాళీ చేయించారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఆందోళన నెలకొనడంతో తహసీల్దార్ స్వాతి, సీఐ శ్రీనివాస్ అక్కడకు చేరుకుని వారితో మాట్లాడుతూ అర్హులైన వారిని త్వరలోనే గుర్తించి తగిన న్యాయం చేస్తామని చెప్పడంతో ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అనంతరం పంచాయతీ రాజ్ ఇంజనీర్ శివకుమార్ అన్ని రూంలను సీజ్ చేశారు.