
సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న డీఎంహెచ్‌వో
నిర్మల్‌చైన్‌గేట్: సీపీఆర్‌తో 50శాతం గుండెపోటు మరణాలు తగ్గించవచ్చని డీఎంహెచ్‌వో డాక్టర్ ధనరాజ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో సీపీఆర్‌పై జిల్లాలోని మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్, స్టాఫ్‌నర్స్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరికి సీపీఆర్‌పై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో జిల్లా డిప్యూటీ డాక్టర్ రాజేందర్, కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సమత, డిప్యూటీ జిల్లా విస్తరణ, మీడియా అధికారి బారె రవీందర్, సీపీఆర్ జిల్లా కోఆర్డినేటర్ వేణుగోపాలరావు పాల్గొన్నారు.
ముగిసిన ఇంటర్ పరీక్షలు
నిర్మల్‌రూరల్: ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగి శాయి. బుధవారం ద్వితీయ సంవత్సర పరీక్ష నిర్వహించారు. 6,059 మంది విద్యార్థులకు 5,792మంది హాజరు కాగా, 267 మంది గైర్హాజరయ్యారు. జనరల్ కేటగిరిలో 5,345 మందికి 5,119 మంది హాజ రు కాగా 226 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ కేటగిరిలో 714 మందికి 673 మంది హా జరు కాగా, 41 మంది గైర్హాజరయ్యారు. కలెక్టర్ వరుణ్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని సోఫినగర్ గురుకుల పాఠశాల, డీఐవో పలు ప్రైవేట్ కళాశాలలను తనిఖీ చేశారు.
చేపల మార్కెట్‌లో
వసతులు కల్పించాలి
నిర్మల్ చైన్‌గేట్: జిల్లా కేంద్రంలోని చేపల మార్కెట్‌లో అన్ని రకాల వసతులు కల్పించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న చేపల మార్కెట్‌ను కలెక్టర్ పరిశీలించారు. పనులు పూర్తయినందున మొక్కలు నాటాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులున్నారు.

జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల నుంచి సంతోషంగా బయటకు వస్తున్న విద్యార్థినులు