
ముస్తాబైన జిల్లాకేంద్రంలోని బాగులవాడ రామాలయం
నిర్మల్: ‘శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి..’ అంటూ రాములోరి పెళ్లి చూసేందుకు జిల్లా సిద్ధమైంది. ఊరూరా గల రామాలయాలే పెళ్లివేదికలు కానుండగా వీధులన్నీ ఏర్పాట్లతో సందడిగా మారాయి. ఊరంతా వీక్షించేందుకు వాడంతా పందిళ్లు వేస్తున్నారు. ఇప్పటికే కొత్తరంగులద్దుకుని, విద్యుల్లతలతో రామాలయాలు కాంతులీనుతున్నాయి. ఊరి ప్రజలే పెళ్లిపెద్దలు కాగా సీతమ్మను రామయ్య మనువాడనున్నాడు. కనుల పండువగా సాగే కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు భక్తులంతా సిద్ధమయ్యారు. శ్రీరామనవమి పర్వదినాన్ని గురువారం ఘనంగా నిర్వహించుకునేందుకు సకల ఏర్పాట్లు చేశారు. పర్వదినాన్ని పురస్కరించుకుని పలు హిందూ సంస్థల ఆధ్వర్యంలో నిర్మల్, భైంసాల్లో రామనవమి శోభాయాత్ర నిర్వహించనున్నారు.
సందడిగా వీధులు..
రాముడుండని ఇల్లు లేదు, రామాలయం లేని ఊరు లేదు అన్నట్లుగా.. చిన్నదో పెద్దదో దాదాపు ప్రతీ మండలంలో పేరున్న రామాలయాలున్నాయి. శ్రీరా మనవమి పర్వదినాన వేకువజాము నుంచే భక్తుల దర్శనాలు కొనసాగుతాయి. ఆలయాల్లో సీతారా ముల దర్శనం చేసుకోవడంతోపాటు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ కొనసాగే ఉత్సవమూర్తులతో సాగే కల్యాణోత్సవాన్ని వీక్షిస్తారు. రాములోరి పెళ్లి విందునూ భక్తులకు అందించేందుకు ఆలయకమిటీలు అన్నదాన ఏర్పాట్లు పూర్తిచేశాయి. రామనవమి ఏర్పాట్లతో ఆయా ఆలయాల వీధులన్నీ సందడిగా మారాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు.
శోభాయాత్రలు..
శ్రీరామనవమిని పురస్కరించుకుని పలు హిందూసంస్థలు గత కొన్నేళ్లుగా శోభాయాత్రలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా నిర్మల్, భైంసా పట్టణాల్లో గురువారం ఈ యాత్రలు చేపట్టనున్నారు. ఇప్పటికే భైంసా, తానూరులో చేపట్టే యాత్రలకు హైకోర్టు అనుమతిచ్చింది. జిల్లాకేంద్రంలో దేవరకోట లక్ష్మీవేంకటేశ్వర దేవస్థానం నుంచి భారీ రాముడి విగ్రహంతో పలు వీధుల గుండా శోభాయాత్ర సాగనుంది. ఉదయం 10గంటల నుంచే ప్రారంభించనున్నా రు. ముఖ్య అతిథిగా ఎంపీ సోయం బాపూరావు, ముఖ్య వక్తగా రాజులదేవి దిగంబర్ హాజరవుతారని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రస్తుతం రంజాన్ మా సం కొనసాగుతుండడం, గతంలో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్‌గా ఉన్నారు. ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్క డా అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దని, రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సీరియస్‌గా హెచ్చరించారు. ప్రశాంతంగా పండుగలు జరుపుకొనేలా ప్రజలు సహకరించాలని ఎస్పీ ప్రవీణ్‌కుమార్ కోరారు.
నేడు ఊరూరా సీతారాముల కల్యాణం
వేదికలుగా మారిన రామాలయాలు
సందడిగా కనిపిస్తున్న వీధులు
నిర్మల్, భైంసాల్లో శోభాయాత్రలు
బందోబస్తుకు సిద్ధమైన పోలీసులు
తరతరాలుగా వేడుకలు
జిల్లాలోని పలు రామాలయాల్లో తరతరాలుగా రామనవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని బ్రహ్మపురి రాంమందిర్‌లో గత కొన్ని దశాబ్దాలుగా సీతారాముల కల్యాణోత్సవాన్ని చేపడుతున్నారు. అలాగే స్థానిక బాగులవాడ రామాలయానికి భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శాంతినగర్ రామాలయంలోనూ కనులపండువగా సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. జిల్లాకేంద్రంలోని ఆలయాలతోపాటు భైంసా మండలం కామోల్, లక్ష్మణచాంద మండలం చామన్‌పెల్లి, కడెం సీతారామచంద్రస్వామి, నర్సాపూర్(టీ) మండలకేంద్రంతో పాటు మండలంలోని రాంపూర్, ఖానాపూర్ పట్టణంలోని శ్రీరాంనగర్‌తో పాటు మండలంలో మస్కాపూర్‌లోగల రామాలయాలు జిల్లాలో ప్రధానాలయాలుగా పేరొందాయి.

జిల్లాకేంద్రంలోని బ్రహ్మపురి రాంమందిర్‌లో తలంబ్రాలు కలుపుతున్న భక్తులు