
పోస్టర్ ఆవిష్కరిస్తున్న నాయకులు
భైంసాటౌన్: అంబేద్కర్ జీవితచరిత్రను నృత్యరూపకంగా ప్రదర్శించనున్నట్లు భైంసా దళిత, ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు తెలిపా రు. బుధవారం స్థానిక ఏరియాస్పత్రి వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట పోస్టర్ ఆవిష్కరించారు. ఏప్రిల్ 4న సాయంత్రం 7గంటలకు భైంసాలోని పార్డి(బీ) బైపాస్ రోడ్‌లో సంఘం శరణం గచ్ఛామి పేరిట నృత్యరూపకం ఉంటుందని పేర్కొన్నారు. సామాజిక సంఘాలు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు, ఇతరులు హాజరై తిలకించాలని కోరారు. నాయకులు ప్రసంజిత్ ఆగ్రే, భీంరావు డోంగ్రే, గిరిధర్ జంగ్మే, గౌతం పింగ్లే తదితరులున్నారు.