
ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్న పోలీస్ బలగాలు
భైంసాటౌన్: శ్రీరామనవమిని పురస్కరించుకుని ప ట్టణంలో గురువారం శోభాయాత్రను ఘనంగా ని ర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశా రు. హైకోర్టు కూడా ర్యాలీకి అనుమతిచ్చింది. దీంతో స్థానిక పురాణాబజార్‌లోని గోశాల నుంచి పిప్రి కాలనీలోని రాంలీలా మైదానం వరకు రాముని విగ్రహంతో శోభాయాత్ర చేపట్టనున్నారు. శోభాయాత్ర నిర్వహించే దారి పొడవునా కాషాయజెండాలు ఏర్పాటు చేశారు. గోశాల నుంచి గుజిరిగల్లి, భట్టిగల్లి, కుభీర్‌రోడ్డు, పద్మావతి కాలనీ, మున్సిపల్ చౌర స్తా, బస్టాండ్ మీదుగా శివాజీచౌక్, రాంలీలా మైదా నం వరకు దారి పొడవునా, కూడళ్ల వద్ద కాషాయజెండాలు రెపరెపలాడుతున్నాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఎస్పీ ప్రవీణ్‌కుమార్ భైంసాకు చేరుకుని శోభాయాత్ర రూ ట్‌మ్యాప్ పరిశీలించారు. బుధవారం సాయంత్రం పోలీస్ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు.