నిర్మల్ టౌన్: యువత దేశప్రగతిలో భాగస్వాములు కావాలని సేంద్రియ వ్యవసాయ నిపుణుడు నల్ల చంద్రమోహన్, ఆయుర్వేద డాక్టర్ అల్లాడి ప్రవీణ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో నైబర్ హుడ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రిసోర్స్‌పర్సన్ జీ 20 మిషన్ లైఫ్ సిరిధాన్యాల గురించి విద్యార్థులకు వివరించారు. యువత దేశ ప్రగతిని అన్ని రంగాల్లో ముందుండి నడిపించాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి సుశీల్‌బాడ్, వలంటీర్లు రవళి, కిరణ్, ఎన్.ప్రవీణ్, మనోజ్‌యాదవ్, చిన్నోల్ల ప్రవీణ్, ప్రిన్సిపాల్ అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక క్వారీ పరిశీలన
చెన్నూర్: పట్టణం సమీపంలోని గోదావరినదిలో ఉన్న ఇసుక క్వారీని బుధవారం సింగరేణి ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శశిధర్‌రావు సందర్శించారు. సర్వేయర్ తిరుపతిని అడిగి హద్దులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఆస్తుల పరిరక్షణ కోసం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైన అక్రమాలు చోటు చేసుకుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ ఇన్స్‌పెక్టర్ అజీమొద్దీన్, సెక్యూరిటీ సిబ్బంది పాల్గొన్నారు.