
జిల్లా కేంద్రంలో పోలీసుల కవాతు
నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలో శ్రీరామనవమిని పురస్కరించుకొని బుధవారం రాత్రి నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసుల కవాతు నిర్వహించారు. ఈ కవాతు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఇందులో సుమారు 300మంది పోలీసులు, ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీలు, పది మంది సీఐలు, 25 మంది ఎస్సైలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నిర్మల్ ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు.
ముధోల్: మండల కేంద్రంలో పోలీసుల కవాతు నిర్వహించారు. శ్రీరామ నవమిని పురస్కరించకుని సీఐ వినోద్‌రెడ్డి ఆధ్వర్యంలో బలగాలతో ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ పండుగలను ప్రశాంత వాతా వరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు. ఎస్సైలు తిరుపతి, విక్రమ్, సాయికుమార్, మహేశ్, ఏఎస్సైలు, స్పెషల్ పార్టీ పోలీసులున్నారు.
