
కుంకుమార్చనలో మహిళలు
ఖానాపూర్: శ్రీరామనవమి పురస్కరించుకుని పట్టణంలోని శ్రీరాంనగర్‌కాలనీలోగల సీతారామచంద్రస్వామి ఆలయంలో బుధవారం పలు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పండితుడు కీర్తి రాఘవశర్మ ఆధ్వర్యంలో ఘనపతిపూజ, కర్మణ పుణ్యాహావాచనం, శ్రీసీతారామస్వామి ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకం, పంచామృత త్రయోదశ కళశ మహాభిషేకం, ముత్తయిదువులతో సామూహిక కుంకుమార్చన, సుదర్శన లక్ష్మీనారాయణ, రామచంద్ర మూలమంత్ర హోమం తదితర పూజలు జరిపించారు. కార్యక్రమంలో అర్చకులు రాజశేఖర్‌శర్మ, శశిధర్‌శర్మ, ఆలయకమిటీ సభ్యులు సతీశ్‌రావు దేశ్‌పాండే, అల్లాడి వెంకటేశ్వర్లు, పాదం రాకేశ్, ఆయిందాల జనార్దన్, లాండేరి కిషన్, జన్నారపు శంకర్, చంద్రహాస్, సట్ల నారాయణ, రాముచారి తదితరులున్నారు.