
సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్న వైద్యులు
లక్ష్మణచాంద:రాష్ట్రంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటుతో మృతిచెందుతున్నారు. కార్డిక్ అరెస్ట్ అయినవారికి సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడే అవకాశం ఉండడంతో రాష్ట్ర వైద్య శాఖ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందికి సీపీఆర్‌పై మంగళవారం అవగాహన కల్పించారు. న్యూవెల్మల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు సమత, లక్ష్మణచాంద పీహెచ్‌సీ డాక్టర్ శ్రీకాంత్ సీపీఆర్‌పై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సీపీఆర్ చేసినప్పుడు గుండె స్పందన, ప్రసరణ ఏవిధంగా జరిగి మళ్లీ గుండె కొట్టుకోవడం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చేసి చూపించారు. సీపీఆర్ చేసి అనంతరం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుని సమీపంలోని ఆసుపత్రికి వెళ్లే వరకు ఏ మందులు వాడాలో తెలిపారు.