
మొండిగుట్టలో మాట్లాడుతున్న మంత్రి ఐకేరెడ్డి
● మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
మామడ: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగుట్ట గ్రామంలో బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐకేరెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతుకు వెన్నెముకగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిలిచిందన్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్య కల్పించి గ్రామాలలో సమస్యలు పరిష్కరించామన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబందు, ఆసరా ఫించన్లు అందిస్తున్నామని వివరించారు.
రాష్ట్రంపై కేంద్రం సవతితల్లి ప్రేమ....
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా సవతితల్లి ప్రేమను చూపుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ను ఎదురించలేక ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ పేరుతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నా కేంద్రం పరిహారం అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు రూ.10 వేల పరిహారం అందిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పాటు జరిగినప్పటికీ కేంద్రం కేంద్రీయ విద్యాలయాలు, మెడికల్ కళాశాలలు మంజూరు చేయలేదని విమర్శించారు. రాష్ట్రం స్వంత నిధులతో మెడికల్ కళాశాలలను ప్రారంభించిందన్నారు. కేంద్రం సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్యులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రాంకిషన్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, గౌతంరెడ్డి, లింగారెడ్డి, హరీశ్‌కుమార్, గంగారెడ్డి, చంద్రశేఖర్‌గౌడ్, నవీన్‌రావు, రాందాస్, లింగారెడ్డి, భూషన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, భాస్కర్, వసంత్‌రావు, సత్యనారాయణ, గంగారాం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.