ప్రభుత్వమే మర్డర్లు చేయమని సుపారీ ఇస్తోందా? సంజయ్ రౌత్ ఆగ్రహం 

What is Happening in Maharashtra Asks Shiv Sena Sanjay Raut - Sakshi

మహారాష్ట్రలోని కొల్హాపూర్ అల్లర్ల నేపథ్యంలో శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక టీవీ ఛానల్ నిర్వహించిన డిబేట్లో పాల్గొని లైవ్ లోనే తమ పార్టీ నాయకుడిని చంపేస్తానంటూ బెదిరించడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్. ప్రభుత్వమే తమ ప్రత్యర్థులను చంపేయమని ఆర్డర్లు వేస్తోందా? మర్డర్లు చేయడానికి టెండర్లు కూడా స్వీకరిస్తున్నారా? అని ప్రశ్నించారు. 

కొల్హాపూర్ అల్లర్లు తర్వాత ఆ ప్రాంతంలో గురువారం కర్ఫ్యూ విధించింది ప్రభత్వం. ఈ సందర్బంగా పలు టీవీ డిబేట్లలో పాల్గొన్న శివసేన నాయకుడు సంజయ్ మషీల్కర్ ఒక లైవ్ ప్రోగ్రామ్ లో పాల్గొని కార్యక్రమం ముగిసిన తర్వాత శవసేన(UBT) నాయకుడు ఆనంద్ దూబేను ఉద్దేశించి నువ్వేమైనా ఛత్రపతి శివాజీ వారసుడు అనుకుంటున్నావా? హద్దుల్లో ఉండు... లేదంటే కాల్చి పారేస్తా... అని బెదిరించారు. 

దీంతో ట్విటర్ వేదికగా శివసేన(UBT) నాయకుడు సంజయ్ రౌత్ షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు. 
"మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? ప్రభుత్వం ఇక్కడ ఎలాంటి పరిస్థితులను నెలకొల్పుతోంది? రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టడానికి  ప్రభుత్వమే సుపారీ ఇచ్చి మర్డర్లు చేయమని చెబుతోందా? ఇదేమి సంస్కృతి.  దీనికి హోంమంత్రి ఫడ్నవీస్ సమాధానం చెప్పాలి" అని హిందీలో రాశారు.

ఇది కూడా చదవండి: ఏకమైన ప్రతిపక్షాలు... బీజేపీని ఓడించడమే లక్ష్యం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top