మగ ఉద్యోగులకు 24 వారాల పేరెంటల్‌ లీవ్‌

Volvo India announces 24 weeks paid parental leave for male workers - Sakshi

స్వీడన్ కార్ల తయారీ సంస్థ వోల్వో ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మగ వాళ్లు కూడా ప్రసూతి సెలవులు తీసుకునేందుకు వీలు కల్పించింది. లింగ విషయంలో తటస్థ విధానాన్నిపాటిస్తూ 'ఫ్యామిలీ బాండ్'ను తీసుకొచ్చినట్లు వోల్వో ఇండియా ప్రకటించింది. వోల్వో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారతదేశంలోని పురుష ఉద్యోగులు మొత్తం జీతంలో 80 శాతంతో 24 వారాల(120 పని దినాలు) పేరెంటల్‌ లీవ్ తీసుకోవచ్చు. ప్రసూతి ప్రయోజన (సవరణ) చట్టం, 2017 ప్రకారం మహిళా ఉద్యోగులు 26 వారాల పూర్తి చెల్లింపుతో ప్రసూతి సెలవులను ఇవ్వనున్నట్లు వోల్వో కార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

వోల్వో కార్ ఇండియా గ్లోబల్ ఆదేశాలకు అనుగుణంగా భారతదేశంలోని తల్లులు, తండ్రులు, ఒకే సెక్స్ తల్లిదండ్రులు, పిల్లలను దత్తత తీసుకున్న, సర్రోగసీ ద్వారా కన్నా భారతదేశంలోని అందరి(ఆన్-రోల్, పూర్తి సమయం) ఉద్యోగులకు వర్తిస్తుంది అని ప్రకటనలో తెలిపింది. వయస్సు లేదా వైవాహిక స్థితిపై పరిమితులు లేవు. "వోల్వో, ఉద్యోగి-స్నేహపూర్వక సంస్థ కావడంతో తల్లిదండ్రులు పిల్లలను పెంచేటప్పుడు ఒకరికొకరు అందుబాటులో ఉండాలని, ఇద్దరు భాగస్వాములు ఆనందాలను పంచుకోవాలని నమ్ముతాము" అని వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా అన్నారు. ఈ విధానంతో వోల్వో మరింత మంది ఉద్యోగులను తల్లిదండ్రుల సెలవు తీసుకోవటానికి ప్రోత్సహిస్తుందని జ్యోతి మల్హోత్రా పేర్కొన్నారు.

చదవండి:

ఏప్రిల్ 1 నుంచి వీటి ధరలు పైపైకి!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top