Viral Video: అదృష్టం బాగుండి బతికిపోయాడు.. లేకుంటే ఎంత ఘోరం జరిగుండేది

Viral Video: Miraculously Man Survives Even After Train Passes Over Him - Sakshi

రైలు ప్రమాదాలకు గురై ఎంతో మంది ప్రాణాలు విడుస్తున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. కొంతమంది కావాలనే రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడుతుంటే.. మరికొందరు అనుకోకుండా రైలు ప్రమాదం బారిన పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు దూసుకెళ్లింది. అయితే అదృష్టం బాగుండి మృత్యువును జయించి వీరుడిలా బయటపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని భర్తన రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. దీనిని ప్లాట్‌ఫామ్‌పై  ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశారు. వ్యక్తి పట్టాలపై పడిపోగా అతనిపై నుంచి రైలు వెళ్లింది. ప్లాట్‌ఫామ్‌పై రైలు వేగంగా వెళ్తుండటం వల్ల పట్టాలపై పడిన వ్యక్తి ముందుగా కనిపించలేదు. నిమిషం తరువాత ట్రైన్‌ వెళ్లిపోయాక చూస్తే అతను ఎటు కదలకుండా ప్లాట్‌ఫామ్‌కు అనుకొని కింద ఒకేచోట ఉండిపోయాడు. అంతేగాక అద్భుతంగా అతని ఒంటిపై కనీసం ఒక్క గీత కూడా పడకుండా సురక్షితంగా బయటకొచ్చాడు. 

రైలు స్టేషన్‌ దాటిన తర్వాత సదరు వ్యక్తి తనను బతికించినందుకు దేవుడికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలిపారు. ఈ ఘటనలో బాధితుడు ప్రాణాలతో బయటపడటంతో అక్కడ గుమిగూడిన వారంతా హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. వీడియో ఆధారంగా రైలు వచ్చే కొద్ది క్షణాలముందే వ్యక్తి ట్రాక్‌పై పడినట్లు తెలుస్తోంది. అతని వస్తువులు కూడా పట్టాలపై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top