Viral Video: రాజహంసలు ఒకేచోట సందడి చేశాయి: క్యూట్‌ వైరల్‌ వీడియో!!

Viral Video: Flamingoes Flocking Bird Sanctuary In Tamil Nadu  - Sakshi

పక్షులకు సంబంధించిన వీడియోలు ఎంతో ఆహ్లాదభరితంగా ఉంటాయి. పైగా ఇటీవల అవి భలే మనుషులను అనుకరించడం, చక్కగా స్నానం చేయడం వంటి పనులతో తెగ ఆకర్షిస్తున్నాయి. అచ్చం అలానే ఫ్లైమింగ్‌ పక్కులన్నీ ఒకే చోట సందడి చేసి చూపురులను ఒక్కసారిగా కట్టిపడేశాయి.

(చదవండి: 200 ఏళ్ల నాటి పండుగ... పిండి, కోడి గుడ్లతో చేసే తమాషా యుద్ధం!!)

అసలు విషయంలోకెళ్లితే...తమిళనాడులోని నిస్సారమైన నీటి ప్రదేశంలో చాలా ఫ్లెమింగోలు తిరుగుతుంటాయి. అయితే ఫ్లెమింగ్‌ పక్షలు భారతదేశానికి చెందినవి కావు. ఇవి ఎక్కువగా అమెరికా, ఆఫ్రికా, ఆసియా, ఐరోపా వంటి ప్రాంతాల్లో ఉంటాయి. అంతేకాదు ఈ పక్షులు ఒంటి కాలు మీద నిలబడటం వల్ల శరీర వేడిని సంరక్షించుకుంటాయని నిపుణలు చెబుతున్నారు.  పైగా ఫ్లెమింగ్‌ పక్షుల్లో సైజు పరంగా పెద్దవి బాగా ఎగిరే సామర్థ్యం కలవి. అయితే ఈ పక్షులు పుట్టడం బూడిద ఎరుపు రంగుతో పుడతాయి. కానీ ఎదిగే కొద్ది లేత గులాబీ లేదా ఎరుపు రంగులో ఉంటాయి.

అలాంటి అందమైన ఈ ఫ్లెమింగ్‌ పక్షులు (రాజ హంసలు) తమిళనాడులోని కొడియాకరైలోని పాయింట్ కాలిమెర్ వన్యప్రాణులు పక్షుల అభయారణ్యంలో ఒకేసారి వేల సంఖ్యలో సందడి చేశాయి. ఈ మేరకు తమిళనాడు అడువుల పర్యావరణ వాతావరణ మార్పులు ప్రిన్స్‌పాల్‌ సెక్రటరీ సుప్రియా సాహు ఈ వీడియోతో పాటు తమిళనాడులోని కాలిమేర్‌ వన్యప్రాణులు పక్షుల అభయారణ్యం వేల సంఖ్యలో వలస పక్షులతో కళకళలాడుతోంది అనే క్యాప్షన్‌ జోడించి మరీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. అంతేకాదు లక్షల్లో వ్యూస్‌, లైక్‌లు వచ్చాయి. మీరు ఓ లుక్కేయండి.

(చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top