Viral Video: Delhi School Teacher Dances With Students - Sakshi
Sakshi News home page

Viral Video: వావ్‌ అమేజింగ్‌.. విద్యార్థినితో స్టెప్పులేసిన టీచర్‌!

Apr 28 2022 7:24 PM | Updated on Jul 28 2022 7:19 PM

Viral Video: Delhi School Teacher Dances With Students - Sakshi

టీచర్లంటే స్ట్రిక్ట్‌గా ఉంటారు. పిల్లలకు చదువు చెప్పడం.. హోం వర్క్‌ చేయకుంటే దండించడం వారి విధి. టీచర్‌ ముందు విద్యార్ధులందరూ డిసిప్లెన్‌గా ఉండాలి. ఈ విషయాలే మనకు బాగా గుర్తొస్తాయి. కానీ ఢిల్లీలోని ఓ మహిళా ఉపాధ్యాయురాలు ఓహో టీచర్లు పిల్లలతో ఇలా కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా తప్పదు. 

ఇంతకీ విషయంలోకి వెళితే.. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినితో కలిసి ఓ మహిళా ఉపాధ్యాయురాలు తరగతి గదిలోనే డ్యాన్స్‌ చేసింది. పిల్లలందరిలో ఓ విద్యార్థి ముందుకు వచ్చి హర్యాన్వీ పాటకు డ్యాన్స్‌ చేయడం ప్రారంభించింది. ఇంతలో పక్కనే ఉన్న టీచర్‌ మను గులాటీ.. విద్యార్థినితో కలిసి కొన్ని స్టెప్పులు వేశారు. విద్యార్థినిని అనుకరిస్తూ చాలా అందంగా డ్యాన్స్‌ మూవ్స్‌ చేశారు. ఇద్దరు కలిసి డ్యాన్స్‌ చేయడంతో  క్లాస్‌లోని మిగతా స్టూడెంట్స్‌ చప్పట్లతో వారిని ఎంకరేజ్‌ చేశారు.
చదవండి👉బాయ్‌ఫ్రెండ్‌పై కోపం.. ఆమె చేసిన పనికి షాక్‌లో లవర్‌

దీనిని స్వయంగా టీచర్‌ ట్విటర్‌లో షేర్‌ చేయడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘వావ్‌ అమేజింగ్‌. అద్భుతంగా డ్యాన్స్‌ చేశారు. టీచర్లు విద్యార్థులతో ఇలా కలివిడిగా ఉంటూ బోధించడం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి టీచర్లు ఉంటే బాగుంటుంది.  అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 
చదవండి👉 సెలవు కావాలని వైరల్‌ లేఖ

Advertisement
 
Advertisement
Advertisement