బిల్‌ అడిగితే చిల్లర ఇచ్చాడు.. తీరా ఆర్డర్‌ చూసి షాక్‌ అయ్యాడు!

Viral: Man Paid For Breakfast In Coins Receives Sandwich Cut Up Tiny Chunks - Sakshi

సోషల్‌మీడియాలో యూజర్ల సంఖ్య పెరిగినప్పటి నుంచి కాస్త డిఫెరెంట్‌గా ఎక్కడ ఏం జరిగినా అది వైరల్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే పలు వీడియోలు, ఫోటోలతో కొందరు సెలబ్రిటీలుగా మారిన ఘటనలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం హోటల్‌కి వెళ్లడం, ఆర్డర్‌ ఇస్తే సర్వర్‌ పుడ్‌ తీసుకురావడం సహజమే. కానీ ఓ వ్యక్తి బిల్‌ వెరైటీగా కట్టడంతో అంతే వెరైటీగా ఆ హోటల్‌ సిబ్బంది ఆర్డర్‌ తెచ్చి ఇచ్చాడు. 

వివరాల్లోకి వెళితే.. ఓ వ్య‌క్తికి ఆక‌లి వేయడంతో అతనికి సమీపంలోని రెస్టారెంట్‌కు వెళ్లి సాండ్‌విచ్‌ ఆర్డర్‌ చేశాడు. అంతవరకు బాగానే ఉంది గానీ బిల్‌ దగ్గరకు వచ్చే సరికి.. అతని దగ్గర అన్నీ చిల్ల‌ర నాణేలే ఉన్నాయి. వాటిని ఇవ్వాలా వద్దా అనుకుంటూనే చివరికి బిల్‌గా చిల్లరనే ఇచ్చాడు. కాసేపటి తర్వాత సాండ్‌విచ్ ఆర్డ‌ర్ రానే వ‌చ్చేసింది. దాన్ని ఓపెన్ చేసి చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ సాండ్‌విచ్‌ అన్నీ చిన్న చిన్న ముక్క‌లుగా కట్‌ చేసి ఉన్నాయి. 

చిల్ల‌ర నాణేల‌ను బిల్‌గా కట్టాడని ఆ రెస్టారెంట్ సిబ్బంది కూడా సాండ్‌విచ్‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి ఆర్డ‌ర్‌ను డెలివ‌రీ చేశాడు. ఆ ఫోటోను ఓ వ్యక్తి ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా ప్ర‌స్తుతం నెట్టింట వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన నెటిజ‌న్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.  

చదవండి: Viral Video: యుద్ధ విమానం విన్యాసం.. ఇంత ధైర్యమా..!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top