చెన్నై: ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా లేదా ఇతర పార్టీలు పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఇంత ఉద్రిక్తతల నడుమ విజయ్ చేసిన ట్వీట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఫలితాలలో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ విజయ్ ట్వీట్ చేశారు. " 12వ తరగతి పబ్లిక్ పరీక్షలో అచంచలమైన పట్టుదలతో విజయం సాధించిన నా ప్రియమైన సోదరులకు, నీ సోదరీమణులకు హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మీ కఠోర శ్రమకు లభించిన గుర్తింపు. ఉన్నత విద్యలో తదుపరి దశకు ఆత్మవిశ్వాసంతో అడుగు పెట్టండి. అదే సమయంలో, ఈసారి విజయం సాధించలేని వారు నిరాశ చెందవద్దు. మళ్ళీ ప్రయత్నించండి. మనం విజయపు అంచున ఉన్నామని గుర్తుంచుకోండి.మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను." అని ట్వీట్ చేశారు.
కాగా ప్రస్తుతం విజయ్ టీవీకే పార్టీకి మెజారిటీకి ఇంకా ఐదు స్థానాల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో కమ్యునిస్టులు,వీసీకే పార్టీ మద్దతు ఇస్తారా లేదా అన్న అంశం ఈ రోజు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరగనుందా అని ఉత్కంఠ వాతావరణం నెలకొంది.


