PM Proved Me Wrong: Veteran Bidri Craft Artist From Karnataka Shah Rasheed Ahmed Quadri To PM At Padma Awards - Sakshi
Sakshi News home page

వీడియో: మోదీజీ.. ఇది అస్సలు ఊహించలేదు, మీరది తప్పని నిరూపించారు

Apr 6 2023 8:59 AM | Updated on Apr 6 2023 1:37 PM

Veteran Craft Artist Praise PM Modi At Padma Awards - Sakshi

బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేదని.. 

రాష్ట్రపతి భవన్‌ వేదికగా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో ఆసక్తికర సంభాషణ ఒకటి జరిగింది. కర్ణాటకకు చెందిన హస్త కళాకారుడు ఒకరు.. బీజేపీ ప్రభుత్వం నుంచి ఇది అస్సలు ఊహించలేదంటూ ఆశ్చర్యం, ఆనందం వ్యక్తం చేశారు. దానికి ప్రధాని మోదీ కూడా నవ్వులు చిందించడం విశేషం. 

కర్ణాటకకు చెందిన బిద్రీ కళాకారుడు రషీద్‌ అహ్మద్‌ ఖ్వాద్రీకి పద్మశ్రీని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నిన్న(బుధవారం) జరిగిన కార్యక్రమంలో ఆయన అవార్డు అందుకున్నారు. అయితే.. 

అవార్డుల విజేతలను ప్రధాని మోదీ అభినందించే క్రమంలో.. ఖ్వాద్రీ ముచ్చటించారు. ‘‘మోదీజీ.. యూపీఏ ప్రభుత్వ హయాంలోనే పద్మ అవార్డు నాకు వస్తుందని అనుకున్నా. కానీ, రాలేదు. మీ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో.. ఈ ప్రభుత్వం నాకు ఎలాంటి అవార్డు ఇవ్వదని అనుకున్నా. కానీ, అది తప్పని మీరు నిరూపించారు. మీకు నా కృతజ్ఞతలు అని ఖ్వాద్రీ, ప్రధాని మోదీతో అన్నారు. 

ఆ దిగ్గజ కళాకారుడి మాటలు వినగానే ప్రధాని మోదీ రెండు చేతులు జోడించి నమస్తే పెట్టి.. చిరునవ్వు నవ్వారు. కాస్త దూరంగా నిల్చున్న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సైతం చిరునవ్వులు చిందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement