దోమల కోసం పొగ వేస్తే.. ఊపిరాడక మహిళ మృతి

TN Woman Dies With Suffocation Due To Fog For Mosquitoes - Sakshi

తిరువొత్తియూరు: చెన్నై పమ్మల్‌ పొన్నియమ్మన్‌ వీధికి చెందిన చొక్కలింగం (53) ప్రభుత్వ ఆస్పత్రిలో ఉద్యోగి. అతని భార్య పుష్పలక్ష్మి బుధవారం రాత్రి ఇంటిలో దోమలు ఎక్కువగా ఉండడంతో నిప్పులతో పొగ వేసి, ఏసీ ఆన్‌ చేసి పడుకున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో ఊపిరాడక పుష్పలక్ష్మి మృతి చెందింది. మిగతా ముగ్గురు ఆస్పత్రిలో పోరాడుతున్నారు.

గురువారం ఉదయం చాలాసేపు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారు వెళ్లి తలుపు తెరచి చూడగా పుష్పలక్ష్మి మృతి చెందగా, మిగతా వారు స్ప్పహ తప్పి ఉన్నారు. వారిలో చొక్కలింగం, కుమార్తె మల్లిక, కుమారుడు విశాల్‌ను చెన్నై రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.   
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top