రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు | Tiger Cub Dies After Being Hit by Train | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని పులిపిల్ల మృతి.. మరో రెండింటికి గాయాలు

Jul 17 2024 9:30 AM | Updated on Jul 17 2024 10:00 AM

Tiger Cub Dies After Being Hit by Train

మధ్యప్రదేశ్‌లోని సెహోర్‌లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బుధ్ని ప్రాంతంలో రైలు ఢీకొని ఒక పులి పిల్ల మృతి చెందగా, మరో రెండు పులి పిల్లలు తీవ్రంగా గాయపడ్డాయి. గాయపడిన ఈ పులి పిల్లలను చికిత్స కోసం ప్రత్యేక రైలులో భోపాల్‌లోని వనవిహార్‌కు తరలించారు. మృతి చెందిన పులి పిల్లకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం దానికి అంత్యక్రియలు చేశారు.

ఈ ఉదంతం గురించి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) రాజేష్ ఖరే మాట్లాడుతూ ఉదయం వేళ పులి తన పిల్లలతో కలిసి నీరు తాగడానికి వెళ్లి ఉంటుంది. ఆ సమయంలోనే మూడు పిల్లలు రైలు ప్రమాదం బారిన పడ్డాయి. ఈ ఘటనలో ఒక పులి పిల్ల మృతి చెందగా, రెండు పులి పిల్లలు గాయపడ్డాయి. దీనిపై సమాచారం అందగానే ఘటనా స్థలానికి వెళ్లాం. గాయపడిన రెండు పులి పిల్లలను చికిత్స కోసం భోపాల్‌లోని వన విహార్‌కు తరలించామని తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement