మనిషిని అనుకరించిన ఏనుగు.. ఏకంగా తొండంతో

Thirsty Elephant Operates Hand Pump on His Own to Drink Water - Sakshi

వైరలవుతోన్న వీడియో

పాపం మూగజీవి.. చోద్యం చూడకపోతే సాయం చేయొచ్చుగా

రోజు రోజుకి వేసవి తీవ్రత అధికమవుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనుషులతో పాటు జంతువులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. వేసవి తాపానికి ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. మన పరిస్థితే ఇలా ఉంటే ఇక నోరులేని జంతువుల సంగతి చెప్పక్కర్లేదు. అడవిలో నీరు దొరక్క.. జనవాసంలోకి వస్తున్నాయి మూగ జీవులు. ఈ క్రమంలో దాహంతో అ‍ల్లాడుతున్న ఏనుగు.. స్వయంగా చేతి పంపు కొట్టుకుని.. నీరు తాగుతున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది.

దాహం తీర్చుకోవడం కోసం గజరాజు ఇన్ని తిప్పలు పడుతుంటే.. ఆ పక్కనే కొందరు కూర్చుని చోద్యం చూశారు.. తప్ప దానికి సాయం చేయలేదు. ఈ దృశ్యాలు చూసిన నెటిజనులు ‘‘మీకు కొంచెం కూడా మానవత్వం లేదా.. పాపం మూగ జీవి నీటి కోసం అ‍ల్లాడుతుంటే.. చోద్యం చూస్తారా’’ అని విమర్శిస్తున్నారు. 

ఇక ఈ వీడియోలో దాహంతో ఉన్న ఏనుగు చేతి పంపు దగ్గరకు వచ్చింది. నీరు ఎలా తాగాలో అర్థం కాలేదు. వెంటనే దానికి మనుషులు చేతి పంపును ఎలా వాడతారో గుర్తుకు వచ్చినట్లుంది. దాంతో అది కూడా తన తొండతో చేతి పంపు కొట్టి.. నీరు తాగి తన దాహం తీర్చుకుంది. అయితే ఏనుగు ఇంత కష్టపడుతుంటే.. పక్కనే ఉన్న ముగ్గురు వ్యక్తులు చోద్యం చూశారు తప్ప దానికి సాయం చేయలేదు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఏనుగు సమయస్ఫూర్తిపై ప్రశంసలు.. ఆ వ్యక్తులపై విమర్శలు చేస్తున్నారు.  

చదవండి: ‘‘కన్నీరాగడం లేదు.. జీవితాంతం వెంటాడుతుంది’’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top