తెలుగు బాలుడి సాహసయాత్ర.. రోజుకు 150 కిలోమీటర్లు సైకిల్‌పై..

Telugu Boy Urdanapalli Ashish Reached Leh From Chennai in 41 Days - Sakshi

చెన్నై–లేహ్‌ సైకిల్‌ యాత్ర చేసిన 15 ఏళ్ల ఆశిష్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: తల్లిదండ్రులు తమ కలల్ని పిల్లలపై రుద్దకుండా, పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలంటూ 10వ తరగతి పూర్తిచేసిన తెలుగు బాలుడు 15 ఏళ్ల ఉర్దనపల్లి ఆశిష్‌ చెన్నై నుంచి లద్దాఖ్‌ రాజధాని లేహ్‌ వరకు సైకిల్‌ మీద సాహసయాత్ర చేశాడు. వైఎ‍స్సార్‌ కడప జిల్లా రాజంపేట ప్రాంతానికి చెందిన ఆశిష్‌ కుటుంబం వ్యాపారరీత్యా కొన్నేళ్ల కిందట చెన్నైలో స్థిరపడింది. సైక్లింగ్‌పై ఆసక్తి ఉన్న ఆశిష్‌ జూలైలో చెన్నై నుంచి సైకిల్‌పై బయలుదేరి 41 రోజుల్లోనే లేహ్‌కు చేరుకున్నాడు. సైకిల్‌యాత్రను పూర్తిచేసి తిరుగుప్రయాణంలో ఢిల్లీకి చేరుకున్న ఆశిష్‌ సహా అతడి కుటుంబసభ్యులు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. 

ఆశిష్‌ మాట్లాడుతూ సైకిల్‌ యాత్రలో మైదాన ప్రాంతంలో రోజూ 120 నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించినట్లు చెప్పాడు. చండీఘడ్‌ నుంచి పర్వత ప్రాంత ప్రయాణం మొదలయ్యాక ప్రతికూల వాతావరణం, వర్షం కారణంగా తీవ్రంగా ఇబ్బందిపడినా యాత్రను కొనసాగించినట్లు తెలిపాడు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో చేరాలన్నదే తన కల అని పేర్కొన్నాడు. తనపై తల్లిదండ్రులెప్పుడూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, మిగతా పిల్లల తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు. చెన్నై నుంచి లండన్‌కు సైకిల్‌యాత్ర చేయనున్నట్లు ఆశిష్‌ చెప్పాడు. (క్లిక్‌: 23 నిమిషాల్లో 2005 కిక్స్.. తైక్వాండోలో బాలిక ప్రతిభ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top