Sonu Sood Says Order Me Free Home Delivery Of Fresh Vegetables Tweet Viral - Sakshi
Sakshi News home page

Sonu Sood: ప్రజలందరికీ సోనూసూద్‌ రిక్వెస్ట్‌

Nov 6 2021 3:57 PM | Updated on Nov 6 2021 5:17 PM

Sonu Sood Says Order Me Free Home Delivery Of Fresh Vegetables Tweet Viral - Sakshi

సాక్షి, ముంబై: క‌రోనా వైరస్‌ వేళ అభాగ్యుల‌కు బాలీవుడ్ న‌టుడు సోనూసూద్ అండ‌గా నిలిచి వార్త‌ల్లోకెక్కిన విషయం తెలిసిందే. రైతులు, కార్మికులు, రోగులు.. ఆయన్ని సాయం కోరినవారికి తనకు తోచిన సాయం చేస్తూవసున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పలువురు తమ సమస్యలను సోనూసూద్‌ దృష్టికి సోషల్‌ మీడియా ద్వారా తీసుకెళ్తుతున్నారు. ఈ చేస్తున్న సేవలకు గాను కొంతమంది అభిమానులు ఆయన ఇంటివద్దకు వెళ్లిమరీ కృతజ్ఞతలు తెలిపినవారు ఉన్నారు.

తాజాగా సోనూసూద్‌ తన ఇంటి ముందుకు వచ్చిన కూరగాయలు అమ్మె ఇద్దరు వ్యక్తులు మాట్లాడాడు. వారి బండిలో ఉన్న కూరగాయల ధరల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా వారు ఎక్కడి నుంచి వచ్చారో కూడా కనుకున్నారు. బండి మీద కూరగాయాలు అమ్మెవారి వద్ద తాజా కూరగాయలు ఉంటాయని తెలిపారు. బండిమీద కూరగాయలు ఆమ్మెవారి వద్ద కొంటే చిన్న వ్యాపారులకు సాయం అందిచినట్లు అవుతుందని అన్నారు. కూరగాలయబండి వారితో మాట్లాడిన ఓ వీడియోను సోనూసూద్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘తాజా కూరగాయల డెలివరీ కోసం నాకు ఆర్డర్‌ చేయండి’ అని కామెంట్‌ చేశారు. ఇటీవల సోనుసూద్‌ రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు మ‌రోమారు వినిపిస్తున్నాయి. ఇటీవల సోనూసూద్‌.. ఎన్నిక‌ల్లో గెలుపొందిన రాజ‌కీయ నాయ‌కులు త‌మ మ్యానిఫెస్టోలో చేసిన వాగ్దానాలు అమ‌లు చేయ‌క‌పోతే వారు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యల కారణంగా సోనూసూద్‌ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement