నెటిజన్‌కు.. దిమ్మ తిరిగే సమాధానం

Sonu Sood Epic Reply To Some In Twitter Take Him To A Liquor Shop - Sakshi

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌లో వలస కార్మికులు తమ సొంత ప్రాంతాలకు మండుటెండలో రహదారుల వెంట నడుచుకుంటూ వెళ్తు ఇబ్బందులు పడుతున్నారు. వలస కార్మికులు కష్టాలను చూసి చలించిపోయిన బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్ ముంబైలో చిక్కుకున్న కర్ణాటక వలస కూలీలను పది బస్సుల్లో వారి ఇళ్లకు పంపించాడు. అదే విధంగా పంజాబ్‌లోని వైద్యులకు పిపిఈ కిట్లు కూడా బహూకరించిన సంగతి తెలిసిందే. ఇక ముంబైలోని తన హోటల్‌ను కోవిడ్‌ చికిత్సలో పని చేస్తున్న వైద్య సిబ్బంది బసకు ఇచ్చాడు. ఇలా వలస కార్మికుల కోసం చేస్తున్న సాయం చూసి అనేక మంది తమకు సహాయం చేయమని సోనూ సూద్‌కి విన్నపాలు చేయడం మొదలుపెట్టారు. అయితే  తాజాగా ఓ వ్యక్తి  సోను సూద్‌ ట్విటర్‌లో ఓ వింతైన విన్నపం చేశారు. ‘తాను ఇంట్లో ఉన్నానని, ఇంటి నుంచి మద్యం షాపు వరకు వెళ్లడానికి సాయం అందించాలి’ అని ట్వీట్‌ చేశారు. ('మీ సాయం మిమ్మల్ని చూసి మరింత గర్వపడేలా చేస్తోంది')

దీనికి స్పందించిన సోనూ సూద్‌.. ‘మద్యం షాపు నుంచి ఇంటికి వెళ్లడానికి కూడా సాయం చేస్తాను. అయితే ఇది నీకు అవసరమైతే నాకు తెలియజేయండి’ అని దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చారు. సోనూ సూద్‌ ఇచ్చిన సమాధానానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ప్రస్తుతం సోనూ సూద్‌ చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ట్వీట్‌కు 39 వేల మంది లైక్‌ చేయగా, 4 వేల మంది రీట్వీట్‌ చేశారు. దిమ్మ తిరిగిపోయే విధంగా స్పందించారని నెటిజన్లు సోనూ సూద్‌ను మెచ్చుకుంటున్నారు.

ఇక మహారాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి  జయంత్‌ పాటిల్‌ వలస కూలీలకు చేసిన సాయానికి సోనూ సూద్‌ను శనివారం ట్విటర్‌లో ప్రశంసించారు. ‘వలస కార్మికులు వారి స్వస్థలానికి చేరుకోవడానికి సోనూ సూద్‌ బస్సు సౌకర్యం కల్పించారు. తనకు చేతనైన సాయం అందిచారు. సినిమా స్క్రీన్‌పై విలన్‌గా గుర్తింపు పొందిన సోనూ సూద్‌ నిజ జీవితంలో హీరో అయ్యారు’ అని ట్వీట్‌ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే..  అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పృథ్వీరాజ్’ సినిమాలో సోనూ సూద్‌ కనిపించనున్నారు. ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయన్‌గా మాజీ మిస్‌ వరల్డ్‌ మానుషి చిల్లర్ నటిస్తున్న విషయం తెలిసిందే. (కార్తీ బర్త్‌డే.. సోషల్‌ మీడియాలో శుభకాంక్షల వెల్లువ)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top