దగ్గు సిరప్‌కి కంపెనీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి...ఉత్పత్తికి చెక్‌!

Show Cause Notice Issued To Company Could Not Produce Log Book  - Sakshi

చిన్నారులను మింగేసిని దగ్గు సిరప్‌ కంపెనీ మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌లో పలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. డబ్ల్యూహెచ్‌వో గాంబియాలో దాదాపు 66 మంది చిన్నారులు బారత్‌ తయారు చేసిన సిరప్‌ వల్లే చనిపోయారని పేర్కొనడంతో హర్యానా ప్రభుత్వం ఆ ఉత్పత్తులను నిలిపేసినట్లు తెలిపింది. అంతేగా ఆ కంపెనీ సంబంధించి మూడు జౌషధాలను పరీక్షల నిమిత్తం కలకత్తాలోని సెంట్రల్‌ డ్రగ్‌ ల్యాబ్‌కి పంపారు. ఆ పరీక్ష నివేదికల తదనంతరం సదరు కంపెనీపై చర్యలు తీసుకుంటానని హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్‌ విజ్‌ వెల్లడించారు.

ఐతే కేంద్ర హర్యానా రాష్ట్ర జౌషధ విభాగా సంయుక్త తనిఖీల్లో ఔషధ తయారీలో దాదాపు 12 లోపాలను గుర్తించడంతోనే ఉత్పత్తిని నిలిపేసినట్లు చెప్పారు. ఈ మేరకు కంపెనీకి జారీ చేసిన షోకాజ్‌ నోటీస్‌లో...కంపెనీ ఔషధాలను తయారు చేయడానికి, పరీక్షించడానికి ఉపయోగించిన పరికరాలు, సాధనాల సమాచారానికి సంబంధించిన పుస్తకాన్ని నివేదించడంలో విఫలమైంది. అలాగే సిరప్‌ తయారీలో వాడిన రసాయనాల బ్యాచ్‌కి సంబంధించి సమాచారం కూడా పేర్కొనలేదు.

సిరప్‌ తయారీ, ప్రక్రియ పద్ధతులను నివేదించడంలో విఫలం. అలాగే సిరప్‌కి సంబంధించి పరీక్షల నివేదికనను అందించలేకపోయింది. అంతేగాదు తయారి తేదీకి, ఉత్పత్తి అనుమతించిన తేదీకి చాలా వ్యత్యాసం ఉందంటూ పలు లోపాలను లేవనెత్తింది. ఈ మేరకు హర్యాన స్టేట్‌ డ్రగ్స్‌ కంట్రోలర్‌ షోకాజ్‌ నోటీస్‌కి ప్రతిస్పందించేందుకు సదరు కంపెనీకి సుమారు 7 రోజుల వ్యవధి ఇచ్చింది. సదరు కంపెనీపైన వచ్చిన ఆరోపణలు నిజమైతే గనుక కంపెనీ తయారీ లైసెన్సు రద్దు చేయడమే గాక తదుపరి చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. 

(చదవండి: చిన్నారులను మింగేసిన దగ్గు మందు... సంచలన విషయాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top