పెళ్లి కూడా చేసుకోకుండా ప్రయత్నం

Security Guard Took 25 Years To Pass Maths Pg - Sakshi

భోపాల్‌: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడి​ప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారాడు. మధ్యప్రదేశ్‌ జబల్‌పూర్‌లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్‌కరణ్‌ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్‌ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం  25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్‌లో పీజీ సాధించి  కల నెరవేర్చుకున్నాడు. 

నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. కానీ మ్యాథ్స్‌లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. 

‘నాకు ఇంఘ్లీష్‌ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్‌ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్‌ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్‌ ఆథర్‌ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు.   

ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్‌ కారిడార్‌ 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top