Rain Lashes Delhi, IMD Forecasts Heavy Rainfall In Many States - Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భారీ వర్షం.. ఇండియా గేట్‌, నోయిడాలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Jul 8 2023 9:15 PM | Updated on Jul 8 2023 9:21 PM

Rain Lashes Delhi And IMD Forecasts Heavy Rainfall In Many States - Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

ఇక, భారీ వానల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా, రోడ్ల మీద భారీగా వదర నీరు చేరడంతో మింట్‌ బ్రిడ్జ్‌ ప్రాంతంలో అండర్‌ పాస్‌ను అధికారులు మూసివేశారు. మరోవైపు.. ఇండియా గేట్‌, నోయిడాలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇదిలా ఉండగా.. రానున్న నాలుగు, ఐదు రోజుల్లో జమ్మూ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement