500 గంటలు పట్టినా సరే కదలను: రాహుల్‌ | Rahul Gandhi Said Will Wait For Even 500 Hours | Sakshi
Sakshi News home page

హరియాణా సరిహద్దులో ఉద్రిక్తత.. రాహుల్‌కి అడ్డంకి

Oct 6 2020 5:59 PM | Updated on Oct 6 2020 6:40 PM

Rahul Gandhi Said Will Wait For Even 500 Hours - Sakshi

చంఢీగఢ్‌ ‌: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ట్రాక్టర్‌ ర్యాలీని ప్రారంభించారు. అయితే హరియాణా  సరిహద్దుల్లో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. మూడు రోజుల ర్యాలీలో భాగంగా రాహుల్‌ పంజాబ్‌ నుంచి హరియాణా వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిహద్దులు తెరిచే వరకు ఇక్కడే ఉంటానని.. అందుకుగాను 500 గంటలు వేచి ఉండాల్సి వచ్చినా తనకు సంతోషమే అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ‘వారు మమ్మల్ని హరియాణా సరిహద్దులో ఒక వంతెన మీద ఆపారు. బార్డర్స్‌ తెరిచే వరకు నేను ఇక్కడే ఉంటాను. అందుకు రెండు గంటల సమయం పడుతుంది అంటే 2 గంటలు ఇక్కడే ఉంటాను. ఆరు గంటలు తీసుకుంటే ఆరు, 10, 10, 24 గంటలు, 24, 100 గంటలు, 200 గంటలు , 500 గంటలు పట్టినా సరే నేను కదలను" అన్నారు రాహుల్‌. అంతేకాక సరిహద్దును తెరిచాక శాంతియుతంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. (చదవండి: అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం)

అంతేకాక "వారు సరిహద్దును తెరిచినప్పుడు, నేను శాంతియుతంగా ముందుకు వెళ్తాను. అప్పటి వరకు నేను ఇక్కడ శాంతియుతంగా వేచి ఉంటాను" అన్నారు రాహుల్‌. ఇక హరియాణా లోని బీజేపీ ప్రభుత్వం వంద మందిని మాత్రమే రాష్ట్రంలో ప్రవేశించడానికి అనుమతిచ్చింది. దాంతో రాహుల్‌తో పాటు మరో మూడు ట్రాక్టర్లను వెళ్లడానికి అనుమతి లభించింది. ఇక ఈ రోజు రాహుల్‌ హరియాణా లో రెండు ర్యాలీల్లో ప్రసంగిచాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement