బడ్జెట్‌ సమావేశాల తొలి దఫా.. ముగింపు ముందే! కారణం అదేనా?

Political parties seek early end to first half of Budget session - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల తొలి దఫా బడ్జెట్‌ సమావేశాలను ఫిబ్రవరి 13కు బదులు 10వ తేదీనే ముగించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను పలు పార్టీలు కోరాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ధృవీకరించారు.

‘‘లోక్‌సభ సభా కార్యకలాపాల సలహా కమిటీ(బీఏసీ.. బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ) భేటీలో స్పీకర్‌ వద్ద వారీ విషయాన్ని ప్రస్తావించారు. వారి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుంటానని స్పీకర్‌ హామీ ఇచ్చారు’’ అని చెప్పారు. 

ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాలు రెండు దఫాలుగా జరగనుంది. తొలి సెషన్‌ ఫిబ్రవరి 13వ తేదీతో ముగియనుంది. అయితే 11-12 తేదీలు వారాంతం కావడంతో ఎంపీలు ఈ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక షెడ్యూల్‌ ప్రకారం.. రెండో దఫా సమావేశాలు మార్చి 13వ తేదీన మొదలై.. ఏప్రిల్‌ 6వ తేదీతో సమావేశాలు ముగుస్తాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top