ధారావిలో తొలిసారిగా జీరో కేసు

No New Cases In Dharavi For First Time Since April - Sakshi

ముంబై: పది లక్షల మంది జనాభా ఉండే ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలో ఏప్రిల్‌ 1న మొదటి కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి అక్కడ కరోనా ప్రవేశించిందంటే దాని వ్యాప్తిని నివారించడం అసాధ్యమేనని అందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. కానీ అనూహ్యంగా ముంబైలో కేసులు ఎక్కువవుతున్నా ధారావి మాత్రం కరోనాను కట్టడి చేయగలిగింది. భారత్‌లో కరోనా ఎంటరైన తర్వాత తొలిసారిగా ధారావిలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జూలై 26న ధారావిలో కేవలం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్లీ కేసులు స్వల్పంగా పెరిగినప్పటికీ శుక్రవారం మాత్రం సింగిల్‌ కేసు కూడా వెలుగు చూడలేదు. ఈ మురికివాడలో ట్రేసింగ్‌, ట్రాకింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌(4టీ) ఫార్ములాను పకడ్బందీగా అమలు చేశారు. (చదవండి: రోడ్డుపై గోనె సంచి కదిలింది.. ఏంటాని చూస్తే!..)

కట్టుదిట్టుమైన ప్రణాళికతో కరోనాను కట్టడి చేశారని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రెయేసస్‌ గతంలో ధారావిపై ప్రశంసలు కురిపించారు. కాగా మహారాష్ట్రలో కొత్తగా 3,580 మందికి పాజిటివ్‌ రాగా మొత్తం కేసుల సంఖ్య 19.51 లక్షలకు చేరింది. కోవిడ్‌ మహమ్మారి 49 వేల మందిని పొట్టన పెట్టుకుంది. (చదవండి: ముంబై మురికివాడ ప్రపంచానికి అడుగుజాడ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top