వీడని ప్రతిష్టంభన.. అసంపూర్తిగా చర్చలు | No Headway In Farmers And Government Talks Over Farm Laws | Sakshi
Sakshi News home page

వీడని ప్రతిష్టంభన.. అసంపూర్తిగా చర్చలు

Jan 4 2021 6:19 PM | Updated on Jan 4 2021 7:37 PM

No Headway In Farmers And Government Talks Over Farm Laws - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను నిరశిస్తూ రైతులు చేపట్టిన దీక్షలు మరికొన్నాళ్ల పాటు సాగేలా కనిపిస్తోంది. వ్యవసాయ చట్టాలు, పంటకు గిట్టుబాటు ధరపై ప్రతిష్టంభన  ఎంతకీ వీడటంలేదు. రైతుల సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారం జరిపిన ఏడో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలన్న రైతుల డిమాండ్స్‌ను ఏమాత్రం తలొగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు చట్టాలను వెనక్కి తీసుకోకపోతే దీక్షలు విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8న మరోసారి చర్చలకు రావాలని కేంద్రం పిలుపునిచ్చింది. (చలికి తోడు వాన)

రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో సాగుతున్న రైతు దీక్షలు 40 రోజులుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సింఘు, టిక్రీ, ఘాజీపూర్, చిల్లా, పల్వాల్ సరిహద్దుల వద్ద రైతుల నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. కాగా చర్చల్లో పురోగతి లేకపోతే ఆందోళనలు ఉధృతం చేయాలని ఇదివరకే రైతు సంఘాలు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈనెల 6న ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement