NEET 2021: దేశవ్యాప్తంగా ప్రారంభమైన నీట్‌ పరీక్ష

Neet Ug Exam 2021 Held Between Afternoon 2 To 5 Pm On 12 September - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం ఆదివారం నిర్వహిస్తున్న ‘నీట్‌’(జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా సుమారు 16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.  తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ పరీక్ష కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, విజయవాడ, విశాఖ, తెనాలి, నరసరావుపేట, మచిలీపట్నం, మంగళగిరిలోని కేంద్రాల్లో పరీక్ష జరుగుతోంది. ఏపీ నుంచి ఈ ఏడాది 59 వేల మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. తెలంగాణలో...  దాదాపు 60 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌ కేంద్రాలలో పరీక్ష జరుగుతోంది.

చదవండి: నా పిల్లలే నా తొలి విద్యార్థులు – మేఘన మనోగతం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top