ప్రధాని మోదీకి రక్తంతో లేఖ

Mysore Man Letter To PM Modi With Blood - Sakshi

మైసూరు: పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని చేతన్‌ మంజునాథ్‌ అనే మైసూరువాసి ప్రధాని నరేంద్ర మోదీకి తన రక్తంతో లేఖ రాశాడు. మే 2న అక్కడ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నుంచి ఇప్పటివరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు, మరికొందరు దుండగులు కలసి ఇప్పటికి సుమారు 30 మంది బీజేపీ కార్యకర్తలు, అమాయక హిందువులను దారుణంగా హత్య చేశారని లేఖలో ఆరోపించారు.

సుమారు ఏడు వేల మంది మహిళలపై లైంగిక దాడులు జరిగాయన్నారు. లక్ష మందికి పైగా ప్రజలు భయాందోళనతో పొరుగు రాష్ట్రాల్లోకి వలస వెళ్లిపోయారన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్‌లో చట్టాన్ని కాపాడడంలో పూర్తిగా విఫలం అయిందని, ఈ హింసకు పరోక్షంగా కారణమైందని ఆరోపించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top