Computer System Crashed at Chhatrapati Shivaji Maharaj International Airport - Sakshi
Sakshi News home page

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో సర్వర్‌ క్రాష్‌.. క్యూలతో చుక్కలు చూసిన ప్రయాణికులు

Dec 1 2022 7:05 PM | Updated on Dec 8 2022 12:55 PM

Mumbai Airport Chaos After Servers Crash - Sakshi

కంప్యూటర్‌ క్రాష్‌తో మ్యానువల్‌ చెక్‌ఇన్‌ చేపట్టడంతో ప్రయాణికులు చుక్కలు.. 

ముంబై: విమానాశ్రయంలో సర్వర్‌ క్రాష్‌.. ప్రయాణికులకు చుక్కలు చూపించింది. కంప్యూటర్‌లు పని చేయకపోవడంతో.. మ్యానువల్‌గా చెక్‌ఇన్‌లను చేయడంతో భారీగా ప్రయాణికులు క్యూ కట్టారు. దీంతో.. ఫ్లైట్ టేకాఫ్ షెడ్యూల్‌లో మార్పులు కనిపించాయి.

బుధవారం ఛత్రపతి శివాజీ మహరాజ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లోని రెండవ టెర్మినల్స్‌ నుంచి విదేశీ విమానాలు ఆలస్యం అయ్యాయి. కంప్యూటర్‌ సిస్టమ్‌ క్రాష్‌ కావడంతో.. చెక్‌ఇన్‌ ప్రాసెస్‌ మ్యానువల్‌గా జరిగింది. దీంతో 40 నిమిషాలపాటు ఈ అంతరాయం నెలకొన్నట్లు తెలుస్తోంది. క్యూలో నిలబడిన కొందరు.. సోషల్‌ మీడియాలో అక్కడి పరిస్థితులను అప్‌డేట్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ టెర్మినల్‌ నుంచి విదేశీ విమానాలే కాదు.. స్వదేశీ విమానాలు కూడా సర్వీసులు నడిపిస్తుంటాయి. 

ఇదిలా ఉంటే.. ఎయిర్‌ ఇండియా ఈ పరిస్థితిపై ట్వీట్‌ చేసింది. అంతరాయాన్ని తగ్గించేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందంటూ పేర్కొంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ తర్వాత ముంబై విమానాశ్రయం దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయం. ప్రస్తుతం అక్కడ సేవలు పునరుద్ధరణ అయినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఒక్క ఓటర్‌ కోసం.. 8 మంది సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement