పతంగి కోసం వెళ్లి.. పెంటకుప్పలో పడి

Mumbai 10 Year Old Boy Drowns in Cow Dung While Chasing Kite Dies - Sakshi

ముంబై: సంక్రాంతి పండుగ అనగానే పిల్లలకు వెంటనే గుర్తుకు వచ్చేది గాలిపటాలు. అవును పండుగ ముందు నుంచి మొదలయ్యే పతంగుల సందడి ఆ తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు కొనసాగుతుంది. అయితే పతంగులు సంతోషాన్నే కాదు.. అప్పుడప్పుడు విషాదాన్ని కూడా నింపుతాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది. గాలిపటం కోసం పరిగెత్తుకుంటూ వెళ్లి పేడ కుప్పలో పడి ఓ 10 పదేళ్ల బాలుడు మరణించాడు. ముంబై కండివాలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. వివరాలు.. పదేళ్ల చిన్నారి పండుగ సందర్భంగా గాలిపటం ఎగురేస్తూ.. ఎంజాయ్‌ చేస్తున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో బాలుడు ఎగురవేస్తున్న గాలిపటం పక్కనే ఉన్న ఆవుల షెడ్డు సమీపంలో పడిపోయింది. (చదవండి: వైరల్‌ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం)

షెడ్డు పక్కనే ఓ పెద్ద గొయ్యి ఉంది. దానిలో ఆవుల పేడ వేస్తారు. ఇక గాలిపటం మీద ఆసక్తితో ప్రమాదాన్ని అంచనా వేయకుండా పరిగెత్తిన సదరు చిన్నారి.. ఆ పేడ గోతిలో పడిపోయాడు. బయటకు రాలేక.. ఊపిరాడక మరణించాడు. ఆ సమయంలో పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌ దగ్గర పని చేస్తున్న కొందరు వ్యక్తులు చిన్నారి పేడ గోతిలో పడిపోవడం చూశారు. బయటకు తీద్దామని భావించారు.. కానీ తాము కూడా గోతిలో ఇరుక్కుంటే మరణించే అవకాశం ఉంటుందని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఆ తర్వాత బిల్డింగ్‌ దగ్గర క్రేన్‌ ఉండటంతో దాని సాయంతో బాలుడిని బయకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చిన్నారి మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్లక్ష్యం కింద కేసు నమోదు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top