
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. ఓ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగా మహిళ (27), అప్పుడే పుట్టిన శిశువు మరణించారు. వివరాల ప్రకారం..యూపీ నోయిడాలోని మమురా ప్రాంతంలోని క్వాక్స్ క్లినిక్‌లో మహిళ ప్రసవించింది. అనుభవం లేని వైద్యుల కారణంగా మహిళతో పాటు ఆమె బిడ్డ సైతం డెలీవరీ సమయంలో మరణించారు. తర్వాత మృతదేహాలను క్లినిక్ బయటకు విసిరేశారు. అనంతరం క్లినిక్ యజమాని అక్కడినుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే ఆరెస్టు చేస్తుమని సెంట్రల్ నోయిడా అదనపు పోలీసు డిప్యూటీ కమిషనర్ అంకుర్ అగర్వాల్ తెలిపారు. (మర్డర్ ప్లాన్ బెడిసికొట్టింది.. భార్యాభర్తలు అరెస్టు)