జమ్మూకశ్మీర్‌ ఎల్‌జీగా మనోజ్‌ సిన్హా | Manoj Sinha appointed as new lieutenant governor of Jammu and Kashmir | Sakshi
Sakshi News home page

జమ్మూకశ్మీర్‌ ఎల్‌జీగా మనోజ్‌ సిన్హా

Aug 7 2020 6:19 AM | Updated on Aug 7 2020 6:19 AM

Manoj Sinha appointed as new lieutenant governor of Jammu and Kashmir - Sakshi

మనోజ్‌ సిన్హా

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్‌ నేత మనోజ్‌ సిన్హా (61)ను జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు రాష్ట్రపతి ప్రెస్‌ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకూ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన గిరీశ్‌ చంద్ర ముర్ము రాజీనామా చేయగా, ఆయన్ను నూతన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వికాస్‌ పురుష్‌గా పేరున్న మనోజ్‌ సిన్హా మూడుసార్లు లోక్‌సభకు ఎంపికయ్యారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement