ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్‌ ఏంటంటే! | Karnataka: Youth Beaten Up For Talking To Girl Of Different Faith | Sakshi
Sakshi News home page

ఏడాదిగా పరిచయం.. మైనర్‌తో మాట్లాడుతుండగా చితకబాదిన యువకులు.. ట్విస్ట్‌ ఏంటంటే!

Jan 7 2023 10:39 AM | Updated on Jan 7 2023 6:21 PM

Karnataka: Youth Beaten Up For Talking To Girl Of Different Faith - Sakshi

సాక్షి, బెంగళూరు: సోషల్‌ మీడియాలో పరిచయమైన 17 ఏళ్ల బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడని ఓ యువుకుడిపై కొంతమంది యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. బస్టాండ్‌లో మైనర్‌తో మాట్లాడుతుండగా గుంపుగా వచ్చిన యువకులు అతడ్ని కిడ్నాప్‌ చేసి దారుణంగా చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. సుబ్రమణ్యలోని కల్లుగుండకి చెందిన హఫీద్‌ అనే 20 ఏళ్ల యువకుడికి ఏడాది కిత్రం ఓ మైనర్‌ బాలికతో(17) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది.

చాటింగ్‌ ప్రారంభించడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తరుచూ బస్టాప్‌లో కలిసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జనవరి 5వ తేదీన సుబ్రమణ్య బస్‌స్టాండ్‌లో యువకుడు అమ్మాయితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వచ్చిన యువకుల గుంపు అతన్ని కిడ్నాప్‌ చేశారు. జీపులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. బాలిక జోలికి రావొద్దని, మరోసారి ఆమోను చూడటం, మాట్లాడటం చేయవద్దని కత్తితో బెదిరించారు.

ఈ ఘటనలో భాధితుడి తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనలో రెండు ఎఫ్‌ఐఆర్‌లు ఫైల్‌ చేశారు. యువకుడిపై దాడి చేసినందకు 12 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు.. బాధిత బాలుడిపై కూడా కేసు నమోదైంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు తన కూతురిని వేధింపులకు గురి చేశాడని బాలిక తండ్రి హఫీద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు.
చదవండి: Crime News: దా.. బండెక్కు! అన్నాడు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement