Karnataka Assembly election 2023: కర్ణాటకలో 73.19 శాతం పోలింగ్‌ నమోదు

Karnataka Assembly election 2023: 73. 19percent voter turnout elections - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 73.19 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఎన్నికలు బుధవారం జరగ్గా, తుది గణాంకాలను ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. 73.19 శాతం పోలింగ్‌ నమోదు కావడం ఒక కొత్త రికార్డేనని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి చెప్పారు.

అత్యధికంగా చిక్కబళ్లాపుర జిల్లాలో 85.56 శాతం, బెంగళూరు రూరల్‌లో 85.08 శాతం, అత్యల్పంగా బీబీఎంపీ దక్షిణంలో 52.33 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. రాష్ట్రంలో మొత్తం 58,545 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, రీపోలింగ్‌ నిర్వహించాల్సిన అవసరం ఎక్కడా రాలేదని అధికారులు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top