మామ వేధింపులు తట్టుకోలేక కోడలు..! | Hulimavu Dowry Case | Sakshi
Sakshi News home page

మామ వేధింపులు తట్టుకోలేక కోడలు..!

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

Hulimavu Dowry Case

బెంగళూరు: భర్త ఇంట్లో అదనపు కట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత తన మూడు నెలల పసికందును ఉయ్యాలలో ఉంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బెంగళూరు హుళిమావు ఠాణా పరిధిలో జరిగింది. వందన (23) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాలు.. మూడేళ్ల క్రితం విక్రమశేషతో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 4 లక్షల విలువగల బైకు, బంగారు అభరణాలు కట్నంగా ఇచ్చారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉంది.

 భర్తతో పాటు మామ, ఆమెను అధిక కట్నం తేవాలంటూ రోజూ వేధించేవారు. వందన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది.  పెద్దలు అనేక సార్లు రాజీ పంచాయతీలు చేసినా భర్తలో మార్పు రాలేదు. గదిలో ఆమె శవమై తేలింది. విక్రంశేషు కుటుంబీకులే వందనాను కొట్టి చంపేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో మామ శ్రీనివాస్, మరిది వినిష్‌లపై హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసికందు తల్లి కోసం ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement