breaking news
hulimavu police station
-
ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం
సాక్షి, బనశంకరి: ఆరు నెలల క్రితం అదృశ్యమైన నేపాలీ మహిళ నిర్జీన ప్రాంతంలో అస్థిపంజరంగా కనిపించింది. హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అక్షయనగర అపార్టుమెంట్ వెనుకభాగంలో పొదల మధ్య చెట్టుకు వేలాడుతున్న స్థితిలో ఉన్న అస్థి పంజరం నేపాలీకి చెందిన పుష్పదామి (22)గా పోలీసులు గుర్తించారు. భర్తతో గొడవ పడి... నేపాల్‌కు చెందిన పుష్పాదామి, భర్త అమర్దామి అక్షయనగరలో నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిస. దీంతో అతన్ని భరించలేక నేపాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. గత ఏడాది జులై 8న భర్తపై కోపంతో ఇంటి నుంచి పుష్పదామి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగ డీసీపీ సీకే.బాబా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ఉరి వేసుకున్న స్థితిలో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో హుళిమావు పరిధిలోని అపార్టుమెంట్ వెనుక భాగంలోని పొదల్లో మనిషి తలపుర్రె,అస్థి పంజరం లభ్యమైంది. అస్థిపంజరం పైన పాదరక్షలు, మెడలో ఉన్న నెక్లెస్, ఇతర వస్తువులు అక్కడ పక్కనే లభించాయి. అక్కడ ఎక్కువగా సంచారం లేకపోవడం నిర్జీన ప్రదేశం కావడంతో ఆ వస్తువులు ఎవరూ తీసుకోలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని సీకే బాబా తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. (చదవండి: మొబైల్ చూడొద్దని మందలించారని...) -
ఫేస్బుక్లో మరణ వాంగ్మూలం
విఫల ప్రేమికుడి ఆవేదన భరిత ప్రసంగం సాక్షి, బళ్లారి: తన మరణానికి లవ్ బ్రేకప్ కారణమంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో పాటు అందుకు గల కారణాలను వీడియో రూపం రికార్డుచేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. వివరాలు... హులిమావు బెంగళూరు నగం హులిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అరుణకుమార్ స్థానికంగా ఉంటున్న ఓ యువతిని ప్రేమించాడు. ఇటీవల మనస్పర్థలు రావడంతో ఇద్దరు విడిపోయారు. ఈ నేపథ్యంలో అతడు మూడు రోజుల నుంచి అన్యమనస్కకంగా ఉన్నాడు. శనివారం రోజు ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో విసుగు చెందిన అరుణ్‌కుమార్ ఇంటిలో ఎవరూ లేని సమయంలో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకు ముందు తన ప్రేమ విఫలమైన విషయం.. శనివారం నాటి సంఘటనలు మొత్తం రెండు వీడియోలను తన మాటల ద్వారా రికార్డు చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బయటకు వెళ్లిన తల్లిదండ్రులు వచ్చి చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే వారు యువతిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.