'స్వేచ్ఛ అంటే ఇలా ఉంటుందా'! ఏ జీవికైనా అంతేగా..

Forest Officer Shares Video Of Animals And Birds Being Released Into The Wild - Sakshi

మనిషి దగ్గర నుంచి చిన్న చిన్న జంతువుల వరకు అన్ని ఫ్రీడమ్‌నే కోరుకుంటాయి. తమకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలనుకుంటాయి. ఐతే మనం పెంచుకునేందుకనో లేక మరే ఇతర కారణాల వల్లో కొన్ని పక్షులను, లేదా జంతువులను తెచ్చుకుని బంధించి ఉంచుతాం. ఐతే మనం ఎంతా బాగా టైంకి ఫుడ్‌ పెట్టి మంచిగా పెంచుతున్నా.. అవి ఏదో ఆర్టిఫిషయల్‌గా ఉంటాయే గానీ హ్యాపీగా ఉండలేవు.

అదే తమదైన వాతావరణంలో స్వేచ్ఛగా ఉంటే మాత్రం అవి కూడా ఎంతో ఉల్లాసంగా గెంతులే‍స్తూ సహజసిద్ధంగా చక్కగా ఉంటాయి. ఐతే ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే 'ఫ్రీడమ్‌ అంటే ఇలా ఉంటుందా!' అనే క్యాప్షన్‌ని జోడించి మరీ అటవీ శాఖ అధికారి ఓ అద్భుతమైన వీడియోని పోస్ట్‌ చేశారు. ఆ వీడియోలో బోనుల్లో బంధించి ఉన్న చిరుతలు, కోతులు, లేళ్లు, పక్షులు, గుర్రాలను తదితర వాటిని అడవిలో వదులుతారు. అవి ఒక్కసారిగా మాకు ఫ్రీడమ్‌ దొరికిందోచ్‌! అంటూ భలే రివ్వున వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

(చదవండి:  ఢిల్లీలోని ఆటో రిక్షాలో యూఎస్‌ సెక్రటరీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top