15 ఏళ్ల నుంచి తవ్వకాలు.. విలువైన వజ్రం లభ్యం

Diamond found In Panna District Madhya Pradesh After 15 Years Hunt - Sakshi

భోపాల్‌: రత్నాలు కోసం తవ్వకాలు జరుపుతున్న నలుగురు మైనింగ్‌ కార్మికులకు వజ్రం లభ్యమైంది. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో గత కొన్నేళ్లుగా రత్నాల కోసం పలు ప్రాంతాల్లో గనుల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అయితే హీరాపూర్ తపారియన్ ప్రాంతంలో రతన్ లాల్ ప్రజాపతి లీజుకు తీసుకున్న భూమిలో 8.22 క్యారెట్స్‌ వజ్రం దొరికినట్లు పన్నా కలెక్టర్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా తెలిపారు. అదే విధంగా లభ్యమైన వజ్రాన్ని, మరికొన్ని రత్నాలను ఈ నెలలో వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. వజ్రం వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని  ప్రభుత్వ పన్నులు మినహాయించిన తర్వాత సదరు గనులు లీజ్‌కు తీసుకున్నవారికి ఇస్తామని అధికారులు తెలిపారు.

చదవండి: దారుణం: కూతురు ప్రేమించిన యువకునిపై సుత్తితో దాడి

సెప్టెంబర్‌ 21 లభ్యమైన వజ్రం, కొన్ని రత్నాలను వేలం వేయనున్నట్లు తెలిపారు. తాజాగా లభ్యమైన వజ్రానికి సుమారు రూ. 40 లక్షలు వేలం పలుకుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ‘గత 15 ఏళ్ల నుంచి పలు గనుల్లో తవ్వకాలు జరుపుతున్నామని కానీ, ఎక్కడా వజ్రాలు లభ్యం కాలేదు. అయితే హిరాపూర్‌లో ఆరు నెలల క్రితం లీజుకు తీసుకున్న గనిలో తమకు వజ్రం లభ్యమైంది’ అని మైనింగ్‌ కార్మికల్లో ఒకరైన రాఘువీర్‌ ప్రజాపతి తెలిపారు. గని భాగస్వాములతో కలిసి వేలంలో వచ్చిన డబ్బును తమ పిల్లల చదువులకు ఉపయోగిస్తామని తెలిపారు. 

చదవండి: రైతుల ఆందోళన: కేంద్రానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top