పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్.. | Dalai Lama Faces Backlash Over Viral Video of Him Kissing Boy | Sakshi
Sakshi News home page

Dalai Lama: పెదాలపై ముద్దుపెట్టిన దలైలామా.. వీడియో వైరల్.. నెటిజన్ల ఫైర్..

Published Sun, Apr 9 2023 9:46 PM | Last Updated on Sun, Apr 9 2023 9:46 PM

Dalai Lama Faces Backlash Over Viral Video of Him Kissing Boy - Sakshi

న్యూఢిల్లీ: టిబెట్ బౌద్ధమత గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు సంబంధించిన ఓ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తన వద్దకు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ బాలుడి పెదాలపై ఆయన ముద్దుపెట్టారు. అంతేకాదు తన నాలుకను ముద్దు పెట్టమని ఆ బాలుడ్ని కోరాడు. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఓ మత గురువు అయిన మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? పిల్లలతో ఇలాగేనా ప్రవర్తించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలు అసహ్యంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు.

అయితే దలైలామా బాలుడికి ముద్దుపెట్టే సమయంలో అక్కడున్నవారంతా కేరింతలతో చప్పట్లు కొట్టారు. వీరంతా ఇలా చేయడంపై పులువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దలైలామా బాలుడితో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే మీరంతా ప్రోత్సహించడమేంటని ఫైర్ అయ్యారు.

మరికొందరు నెటిజన్లు మాత్రం దలైలామా ముద్దుపెడుతున్నప్పుడు ఆ బాలుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని అన్నారు. చిన్నారిని పెదాలపై కిస్ చేయడమేంటి? ఇదేం సంప్రదాయం? నాలుకను ముద్దుపెట్టమని అడగడమేంటి అని ప్రశ్నించారు.

అయితే ఓ నెటిజన్ మాత్రం వీరి విమర్శలకు సమాధానం చెప్పాడు. పెదాలు, నాలుకపై ముద్దుపెట్టడం టిబెట్ సంప్రదాయంలో ఓ భాగమని చెప్పుకొచ్చాడు.  టిబెట్‌లో ఒకరి నాలుకను బయటకు తీయడం ఒక ఆచార పద్ధతి అని పేర్కొన్నాడు. ఈ సంప్రదాయం 9వ శతాబ్దానికి చెందిందని, లాంగ్ ధర్మా అనే అపఖ్యాతి పాలైన రాజు పాలన నుంచి ఇది కొనసాగుతోందన్నాడు.
చదవండి: హెల్మెట్ లేకుండా స్కూటీపై మహిళా పోలీసులు.. ‘ఏంటి సర్‌.. ఇదే తప్పు మేం చేస్తే!’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement