
వాషింగ్టన్: అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వీడియో ఆసక్తికర చర్చకు దారి తీసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడన్ భార్య, ప్రథమ పౌరురాలైన జిల్ బైడెన్.. ఆ దేశ ఉపాధ్యాక్షురాలు కమలా హ్యారిస్ భర్త డౌ ఎమ్హోఫ్ పబ్లిక్‌గా చుంబించుకోవడంపై విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది.
అది మామూలు పలకరింపు అయితే ఫర్వాలేదు. ఏకంగా పెదాలపై చుంబనం కావడంతోనే ఇక్కడ యవ్వారం మరో మలుపు తిరిగింది. మంగళవారం కాపిటోల్ హిల్‌లో ప్రెసిడెంట్ బైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియర్ ప్రసంగం సందర్భంగా ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇదిలా ఉంటే.. కమలా హ్యారిస్‌ను మరోసారి ఉపాధ్యక్ష రేసులో నిలపకూడదని బైడెన్ భావిస్తున్నట్లు, ఈ మేరకు వైట్‌హౌజ్ వర్గాలు.. బైడెన్ అంతరంగికుల నుంచి ఆయన ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు లాస్ ఏంజెల్స్ టైమ్స్ తాజాగా ఓ విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది.
ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్థానాలను భారీగా కోల్పోయింది డెమొక్రటిక్ పార్టీ. రిపబ్లికన్లు చాలావరకు స్థానాలు దక్కించుకోవడంతో.. బైడెన్ ప్రసంగంలో స్నేహపూర్వక వ్యాఖ్యలే ఎక్కువగా వినిపించాయి.
Did Jill Biden just kiss Kamala's husband on the LIPS?! pic.twitter.com/KvrUxSI8Lu
— Benny Johnson (@bennyjohnson) February 8, 2023